Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 First Single: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 2023లో సంచలన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం ఇప్పుడు తొలి సింగిల్ ‘అలా బొలేలో’ ఐటం సాంగ్ ను విడుదల చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతంతో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రజనీకాంత్ కంటే పూర్ణ స్క్రీన్ ప్రెజెన్స్‌నే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
‘అలా బొలేలో’ పాటకు సంగీతం అందించడమే కాకుండా అనిరుధ్ స్వయంగా గాత్రం కూడా అందించారు. ‘జైలర్’లో సంచలనం సృష్టించిన తమన్నా సాంగ్ కి రాసిన అరుణ్రాజా కామరాజ్ ఈ పాటకు కూడా సాహిత్యం అందించారు. నాలుగు నిమిషాలు ఉన్న ఈ స్పెషల్ ట్రాక్ లో మలయాళ నేటివిటీ కనిపిస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు షమ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ కూడా ప్రత్యేకంగా కనిపించారు. అయితే పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ పూర్ణ గురించే మొదలైంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా, తన ఎనర్జిటిక్ డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే ‘అలా బొలేలో’లో పూర్ణే అసలు హైలైట్ అంటూ మీమ్స్ కూడా పంచుకుంటున్నారు. మొదటి భాగంలో ‘కావాలా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సీక్వెల్లో ఈ మాస్ ఐటం సాంగ్ కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంటోంది.
Also Read
- Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
- Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
- Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
ఇక సినిమా విషయానికి వస్తే, ‘జైలర్ 2’లో ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి భారీ యాక్షన్‌తో కనిపించనున్నారు. విడుదలైన 55 సెకన్ల ప్రోమో మొదటి సినిమా చివర్లో వినాయకన్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమవుతూ, కథ మరింత పెద్ద నెట్వర్క్ చుట్టూ తిరగబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈసారి ముత్తువేల్‌కు ఎదురయ్యే సవాళ్లు కూడా మరింత పెద్ద స్థాయిలో ఉండనున్నాయని తెలుస్తోంది. తారాగణం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. రమ్యకృష్ణ, మీర్నా, యోగిబాబు తమ పాత్రలను తిరిగి పోషిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే వీరి పాత్రల విషయంలో చిత్రబృందం గోప్యతను పాటిస్తోంది.
ఇక ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘ధర్మన్’లో నటించనున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే భవిష్యత్తులో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి మరో ప్రాజెక్ట్‌లో నటించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ‘అలా బొలేలో’ పాటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనిరుధ్ ఎనర్జిటిక్, పూర్ణ ఆకట్టుకునే డ్యాన్స్, నెల్సన్ విజువల్ ట్రీట్ కలిసి ‘జైలర్ 2’ ప్రమోషన్లకు మంచి ఆరంభాన్ని ఇచ్చాయి. ఇప్పుడు దసరా రిలీజ్‌కు ముందు మేకర్స్ నుంచి వచ్చే తదుపరి అప్డేట్లపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!