Site icon NTV Telugu

Jai Hanuman: ‘హనుమాన్’ లవర్స్ కి బాడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా

Teja Sajja

Teja Sajja

Jai Hanuman not to release in 2025 says Teja Sajja: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా టాలీవుడ్‌లో రిలేజ్ అయి ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమాన్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో భాగమయిన అందరికి ఒక మరపురాని సూపర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమాకి భారీ లాభాలను ఆర్జించడమే కాదు రికార్డు స్థాయిలో భారీ వసూళ్లతో పాటు హీరోగా తేజ సజ్జాకి యువ దర్శకుడిగా ప్రశాంత్ వర్మ సామర్థ్యం మీద చాలా ప్రశంసలు అందుకునెల చేసింది. హనుమాన్ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ గా నిలిచి దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసి, ఆల్-టైమ్ అత్యధిక సంక్రాంతి గ్రాసర్‌గా అలాగే టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా చివరిలో జై హనుమాన్ అని సీక్వెల్ అనౌన్స్ చేసి ఆ సినిమాను ఉన్నత స్థాయిలో ముగించారు.

Vijay TVK Party: 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీ తొలి సమావేశం

ఇక అప్పుడే ఈ జై హనుమాన్ ను 2025లో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఆడియన్స్ సహా హనుమాన్ మూవీ లవర్స్ అందరూ ఒక రకమైన హైలో ఉన్నారు. ఇక దానికి తోడు అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజే సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని దర్శకుడు అధికారికంగా ప్రకటించాడు, అందుకే ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు -ప్రేక్షకులు అంచనా వేశారు. అయితే ఈ విషయంలోనే తేజ సజ్జా బాడ్ న్యూస్ చెప్పారు. తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో తేజ ఈ విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకి చాలా సమయం పడుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఉండడంతో ఈ గ్యాప్‌లో మరికొన్ని సినిమాలు చేస్తానని అన్నారు. భారీ స్థాయి సినిమా కావడంతో 2025లో విడుదల సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు 2026లో ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా మళ్లీ హనుమంతు అనే పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version