చివరిసారిగా “అశ్వత్థామ” సినిమాలో కన్పించిన టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజా స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” మూవీ అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి చేరుకున్న ఆర్చర్ ప్రయాణం గురించి కథా నేపథ్యంతో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు లుక్ ను, ఆయన పాత్రను రివీల్ చేశారు.
Read Also : థియేటర్లా… ఓటీటీలా : క్రాస్ రోడ్స్ లో మన హీరోలు!?
జగ్గూభాయ్ ఇందులో “పార్ధసారధి” అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలుపుతూ తాజా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో జగపతి బాబు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కన్పిస్తున్నారు.
ప్రస్తుతం నాగ శౌర్య ఈ చిత్రంతో పాటుగా “పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి, ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి” వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.
