‘సింబా’లో జగపతిబాబు కీలకపాత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగరికత పేరుతో మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. మనిషి మనుగడకు కారణమవుతున్న చెట్లను నరికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వల్ల వర్షాలు లేకపోవడంతో మనిషికి ఎంతో అవసరమైన, జీవనాధారమైన నీరు దొరకడం కష్టమైంది. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ… సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సంపత్ నంది స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా ద్వారా మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
కొందరు మనుషులు అడవిలోని చెట్లను నరికేస్తున్నారు. అడవి పాడవుతుండటంతో జంతువులన్నీ భయంతో పారిపోతున్నాయి. అయితే అంతలో అడవి మనిషిగా ఉంటూ అడవిలో జీవించే మన కథానాయకుడు ‘సింబా’ చెట్టు నరుకుతున్న వాడిపైకి నరికిన చెట్టును ఆయుధంగా చేసుకుని దాడి చేస్తాడు. ‘మనకు బ్రతుకునిచ్చే మొక్కని బ్రతకనిద్దాం’ అనే లైన్ ద్వారా సినిమా, హీరో పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేలా రీసెంట్ యూనిట్ విడుదల చేసిన వీడియోకు చాలా మంచి స్పందన వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!