Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !

Peddi Jagapathi Babu

Peddi Jagapathi Babu

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూ నడుస్తున్న టాక్, సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెగిటివిటీపై సీనియర్ నటుడు జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబు మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుంటుందని తాను అన్న మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని జగపతిబాబు స్పష్టం చేశారు.

సినిమా ఫలితంపై జగపతిబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ గాని, సినిమాలు గాని ఎట్లా ఉన్నాయి అంటే.. గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది.” నా కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. రామ్ చరణ్ ప్రతి షాట్‌లోనూ సిక్సర్ కొట్టాడు” అని ప్రశంసించారు. అయితే సినిమాకు కావాలనే కొందరు నెగిటివ్ పీపుల్ అడ్డుపడుతున్నారని, ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్‌పై జగపతిబాబు ఓపెన్‌గా స్పందించారు. “నిజం చెప్పాలంటే బిగినింగ్‌లో నా ఎక్స్పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా కలెక్షన్స్ వెళ్ళలేదు. మొదటి రెండు మూడు రోజులు అసలైన పక్కా ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రివ్యూలు, పబ్లిక్ రియాక్షన్స్ చూసి టాక్ పూర్తిగా పాజిటివ్‌గా మారిపోతోంది. ఇప్పుడు థియేటర్లకు ఫ్యామిలీస్ వస్తున్నారు. నిన్న రాత్రి కూడా నేను కొంతమందితో కూర్చున్నప్పుడు.. సినిమా ఇంత బాగుంటే బాలేదు అని ఎలా ప్రచారం చేస్తారంటూ వాళ్లే ఆశ్చర్యపోయారు” అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

×
×
Ad

మొదట చరణ్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్లు వస్తారని.. వాళ్ల మైండ్ సెట్ వేరేలా ఉంటుందని అన్నారు. “ఇది ఒకేసారి 50 మందిని కొట్టేసి విజిల్స్, క్లాప్స్ కొట్టించుకునే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది గుండెకు హత్తుకునేలా ఫీల్ అవ్వాల్సిన సినిమా. ఆ ఫీలింగ్ జనాల్లోకి వెళ్లి, సినిమా బాగుందనే టాక్ బయటకు రావడానికి ప్రీమియర్స్ తో కలుపుకుని కనీసం రెండు రోజులు టైం పట్టింది. ఫ్రైడే నుంచి సినిమా పక్కాగా పికప్ అయింది” అని దర్శకుడు బుచ్చిబాబు, జగపతిబాబుతో అన్నారు. నెగిటివ్ శక్తులు ఎంత ప్రయత్నించినా, ఆర్గానిక్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తుండటం సినిమాకు శుభపరిణామమని మేకర్స్ నమ్ముతున్నారు.