యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. “సలార్” 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్లు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : “మా” ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యిందా ?
ఇంతవరకూ సస్పెన్స్ లో పెట్టిన “రాజమనార్” పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నేడు రిలీజ్ చేశారు. జగపతి బాబును రాజమనార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తయింది. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌పై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత ప్రధాన జంటపై కొన్ని కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి. దీంతో సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు మేకర్స్.
