JVAS : మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా మూవీ గురించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీని.. అప్పట్లో రీల్ రూపంలోనే ప్రదర్శించారు. ఇప్పుడు రీల్ రూపంలో విడుదల చేయడం కుదరదు కదా. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీని బేస్ చేసుకుని 3డీ ప్రింట్ లోకి మూవీని మార్చేశారు.
Read Also : Nani : నానికి కలిసొస్తున్న మాస్ రూట్..
తాజాగా మూవీ టీమ్ దీనిని ప్రకటించింది. చాలా కష్టపడ్డ తర్వాత రీల్ రూపంలో ఉన్న మూవీని 3డీ ప్రింట్ లోకి మార్చినట్టు చెప్పారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మూవీని సరికొత్త ఫుటేజ్ లోకి మార్చామని చెబుతోంది. ఈ 2D అండ్ 3D ఫార్మాట్లలో వస్తున్న సినిమాను త్వరలోనే చిరంజీవి మళ్లీ ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించి చిరు ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మూవీ గురించి ఎవరికీ తెలియని అనేక విషయాలు అందులో పంచుకోబోతున్నారంట.
Read Also :JVAS : చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
