JVAS : మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించిన మ్యాజికట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడ రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. కాగా మొదటి రోజు ఈ సినిమా రూ.1.75 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ చెప్పారు.
Read Also : CM Chandrababu: భారత్-పాక్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం!
ఇన్నేళ్ల తర్వత రీ రిలీజ్ అయినా సరే ఈ మూవీకి ఇంతటి కలెక్షన్లు రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. అశ్వినీ దత్ రూ.8కోట్లతో నిర్మించారు. ఇప్పుడు రీ రిలీజ్ లో మొదటి రోజే ఈ స్థాయిగా వసూలు చేయడం అంటే వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను చిరంజీవి దగ్గరుండి మరీ ప్రమోట్ చేశారు. రాఘవేంద్రరావుతో చేసిన ఇంటర్వ్యూ బాగా కలిసొచ్చింది. ఈ సినిమాను శ్రీదేవికి అంకింతం చేశారు.
Read Also : Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్‌పై మళ్లీ దాడులు?
