NTV Telugu Site icon

Jacqueline Fernandez : బోల్డ్ ఫోటో షూట్ తో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 07 19 At 12.13.18 Pm

Whatsapp Image 2023 07 19 At 12.13.18 Pm

జాక్విలిన్ ఫెర్నాండెజ్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీలంక కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. మర్డర్ 2, రేస్ 2 మరియు హౌస్ ఫుల్ 2 చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. తెలుగులో రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. అలా తన అందం తో అలాగే నటనతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది ఈ భామ.ప్రభాస్ హీరోగా విడుదలైన సాహో చిత్రంలో జాక్వీలిన్ స్పెషల్ సాంగ్ చేసింది.ఆ సాంగ్ కోసం జాక్విలిన్ పెర్నాండెజ్ భారీగానే పారితోషకం తీసుకున్నట్లు సమాచారం..

ఇటీవల విక్రాంత్ రోనా మూవీలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. సుదీప్-జాక్విలిన్ పై తెరకెక్కిన రా..రా రక్కమ్మ సాంగ్ బాగా ట్రెండింగ్ గా మారింది.. టాలీవుడ్ లో కూడా ఈ భామకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.ఇటీవల జాక్విలిన్ కి హరి హర వీరమల్లు మూవీలో అవకాశం వచ్చింది. అనుకోని కారణాలతో ఆమె ఆ సినిమా నుండి తప్పుకున్నారు. జాక్విలిన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో నోరా ఫతేహి కి ఛాన్స్ వచ్చింది. వెంటనే ఆ భామ ఒప్పేసుకుంది.అయితే జాక్విలిన్ పై ఇటీవల  వివాదాలు నడుస్తున్నాయి.. దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమెకు శిక్ష కూడా పడింది. రూ. 50000 పూచీకత్తుపై బెయిల్ కూడా తీసుకున్నారు.ప్రస్తుతం జాక్విలిన్ క్రాక్ మరియు ఫతేహ్ వంటి సినిమాలలో నటిస్తుంది.తాజాగాజాక్విలిన్ ఫెర్నాండెజ్ బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చగొట్టింది. టాప్ తీసి ఈ అమ్మడు జీరో సైజ్ నడుము కనిపించేలా బోల్డ్ గా పోజులు ఇచ్చి మతి పోగొట్టింది..ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments