NTV Telugu Site icon

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం.. టెన్షన్ లో ఫ్యాన్స్..

Jacqueline

Jacqueline

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమెను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో చూశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ఉంటున్న అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రస్తుతం ఈ అమ్మడు ముంబై బాంద్రావెస్ట్ లో నౌరోజ్ హిల్ సొసైటీలో ఉన్న 17 స్టోరీ అపార్ట్మెంట్స్ లో ఓ ఖరీదైన 5 బిహెచ్ కే ప్లాట్ ను తీసుకొని ఉన్నారు.. గత ఏడాది ఈ ప్లాట్ లోకి షిఫ్ట్ అయ్యింది. బుధవారం అర్ధ రాత్రి జాక్వెలిన్ ఉండే అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ లోని ఓ వంటింట్లో మంటలు ఎగిసిపడ్డాయి. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం..

అయితే జాక్వెలిన్ ఇదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉంటుంది.. 15 ఫ్లోర్ లో ఈమె ఉంటుంది.. ఈ ప్రమాదం గురించి విన్న ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. జాక్వెలిన్ కి ఏమైనా అయిందా అంటూ అభిమానులు, నెటిజన్లు ఆరా తీయడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ వైరల్ గా మారింది.. అయితే పై ఫ్లోర్ కు మంటలు వ్యాపించలేదని, ఆమెకు ఏమి కాలేదని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

Show comments