Jacqueline Carrieri: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్ని రోజులే అవకాశాలు.. అవకాశాలు వస్తేనే డబ్బు, పేరు. దీనికోసం హీరోయిన్స్ ఎన్ని కష్టాలు పడతారో అందరికీ తెల్సిందే. జిమ్, యోగా అని న్యాచురల్ కష్టంతో పాటు.. సర్జరీలు కూడా చేయించుకొని ఎప్పటికప్పుడు అందాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఆయా ఆరాటమే.. చాలామంది హీరోయిన్స్ ప్రాణాలను బలితీస్తోంది. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ .. అవి వికటించి ఎంతోమంది నటీమణులు కన్నుమూశారు. తాజాగా మరో నటి సర్జరీ వికటించి మృతి చెందింది. అర్జెంటీనాకు చెందిన మాజీ అందాల సుందరి, నటి జాక్వెలిన్ కరీరీ ఇక్కడవారికి తెలియకపోవచ్చు కానీ, అర్జెంటీనా లో ఆమె ఎంతో ఫేమస్. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది.
Wamiqa Gabbi: సెన్సార్ లేదని.. నగ్నంగా చూపించేస్తారా.. ?
ఇక జాక్వెలిన్.. తన అందాన్ని మరింత మెరుగుపర్చుకుపోవాలని ఈ మధ్యనే ఒక సర్జరీ చేయించుకుంది. అయితే ఆ సర్జరీ జరిగే సమయంలో ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టడంతో ప్రాణాలు విడిచింది. అక్టోబర్ 1 న ఈ ఘటన చోటుచేసుకోగా.. నేడు ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం జాక్వెలిన్ మరణవార్త సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఆమె మరణవార్త విన్న అభిమానులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఎంతో మంచి నటి అని, చిన్న వయస్సులోనే మృతిచెందడం బాధాకరమని పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోపక్క అందం కోసం ఇలాంటి సర్జరీలు చేయించుకోవద్దని, అందం అనేది మనసుకు సంబంధించిందని కామెంట్స్ చేస్తున్నారు.