బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయాన్ని వదలదు. అన్నింటిలోనూ కలుగజేసుకొని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయాలలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే రిజైన్ చేయడం, ఆయన ప్లేస్ లో ఇండో అమెరికన్ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం. పరాగ్ బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిసినప్పటినుంచి ఇండియన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండింగ్ న్యూస్ పై నటి కంగనా రనౌత్ సైతం తనదైన రీతిలో పంచ్ లు వేసింది. కొత్త సీఈవోగా నియమితులైన పరాగ్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెడుతూ ‘బై చాచా జాక్’ అంటూ కౌంటర్ వేసింది. అమ్మడి రివెంజ్ ఈ విధంగా తీర్చుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో కంగనా బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసిందని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ట్వీట్ చేస్తోందని ఆమె ట్విట్టర్ ని ఈ ఏడాది మే 3న శాశ్వతంగా నిషేధించింది ట్విట్టర్ యాజమాన్యం. ప్రస్తుతం కాజాక్ రిజైన్ చేయడంతో తిక్క కుదిరింది అన్న విధంగా ‘బై చాచా జాక్’ అంటూ రివెంజ్ కౌంటర్ వేసింది కంగనా.. ఈమె కాదు జాక్ సీఈవో గా ఉన్నప్పుడు అనుపమ్ ఖేర్, సోనమ్ కపూర్ అకౌంట్స్‌ని కూడా బ్లాక్ చేయించాడు. వారు కూడా ఇలాగే స్పందించడం గమనార్హం. ప్రస్తుతం వీరి కౌంటర్లు నెట్టింట వైరల్ గా మారాయి.
