Site icon NTV Telugu

Jabardasth Shanthi: సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు..

Swaroop

Swaroop

Jabardasth Shanthi: పైకి నవ్వుతూ కనిపించేవారందరు సంతోషంగా ఉన్నట్లు కాదు. నలుగురిని నవ్వించేవారందరికి కష్టాలు లేనట్టు కాదు. ఎన్ని కష్టాలు ఉన్నా .. మనసులో దాచుకొని ప్రేక్షకులను నవ్వించేవాడినే కమెడియన్ అంటారు. రోజు మొత్తం అలసిపోయిన వారికి జబర్దస్త్ అనేది ఎంతో రిలీజ్ ఇచ్చే షో. ఇప్పుడు ఎలా ఉంది అన్నదానికన్నా ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుకుంటే బావుంటుంది. ఇప్పుడంటే యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చాకా టీవీ లో ఈ షో చూడడం తగ్గింది కానీ, ఒకప్పుడు అయితే.. ఈ షో కోసం కుటుంబం మొత్తం ఎదురుచూసేది. ఇక జబర్దస్త్ ద్వారా పరిచయమైన నటులు.. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా మారారు. ఇక మరికొందరు మంచి గుర్తింపును అందుకొని వరుస షోలలో కనిపిస్తున్నారు. అందులో శాంతి స్వరూప్ ఒకడు. బక్క పలచని దేహం.. అబ్బాయిగా కన్నా అమ్మాయిగానే ఎక్కువ కనిపించాడు అతను. శాంతి స్వరూప్ కాస్తా శాంతిగా మారాడు. పొట్టకూటి కోసం ఎన్నో ఇబ్బందుల పడుతున్న సమయంలో జబర్దస్త్ శాంతి పాలిట వరంగా మారింది.

Nani: నేషనల్ అవార్డ్స్.. మనసు ముక్కలు అయ్యిందన్న నాని

ఇక లేడీ గెటప్ లో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇక ఎంత నవ్వించినా.. శాంతి స్వరూప్ వెనుక ఉన్న కష్టాలు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మధ్యనే శాంతి ఒక ఇల్లు కొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజాగా ఆ ఇంటిని అమ్మేస్తున్నట్లు అతను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. తన తల్లికి సర్జరీ చేయించాల్సి ఉందని, దానికి సరిపడ్డ డబ్బులు తనవద్ద లేవని.. అందుకే తన ఇంటిని అమ్మేస్తున్నట్లు తెలిపాడు. తనకు తన తల్లి కన్నా ఏది ముఖ్యం కాదని, ఈ విషయం అమ్మకు చెప్తే ఒప్పుకోదు.. అందుకే ఆమెకు తెలియకుండా అమ్మేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. అధైర్యపడొద్దు.. అమ్మగారు కోలుకుంటారు అని కొందరు.. తల్లి కోసం నువ్వు చేస్తున్న త్యాగం గొప్పది అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version