Site icon NTV Telugu

Jabardasth Rohini: వీల్ చైర్ లో వచ్చి యాంకరింగ్ చేసిన రోహిణి..

Rohini

Rohini

Jabardasth Rohini: మావా అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నటి రోహిణి. ఈ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రోహిణి.. ఆ తరువాత కామెడీ షోస్ లో మెరిసింది. ఇక జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలుపెట్టి టీమ్ లీడర్ గా మారింది. ప్రస్తుతం ఒక పక్క షోస్, ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారిన రోహిణి కొన్ని రోజుల క్రితం ఆసుపత్రి పాలైన విషయం తెల్సిందే. ఇక 2016 లో ఆమె విజయవాడ నుంచి వస్తుండగా కారు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఆ ప్రమాదంలోనే ఆమె కాలికి రాడ్ వేశారు వైద్యులు. ఇన్నాళ్లు ఆ రాడ్ ను తీయించుకోకపోయేసరికి అది బాగా నొప్పి వస్తుండడంతో సర్జరీ చేసి వైద్యులు ఈ మధ్యనే ఆ రాడ్ ను తొలగించారు.

Devara: దేవర కోసం రావణుడు దిగాడు.. ఇక యుద్ధమే

ఇక కొన్నిరోజులు బెడ్ రెస్ట్ తీసుకున్న రోహిణి.. ఎట్టకేలకు షోస్ చేయడం మొదలుపెట్టింది. ఒక బుల్లితెర షోకు యాంకర్ గా వచ్చింది. ఇక ఆమె వీల్ చైర్ లో రావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అంటే ఇంకా రోహిణికి పూర్తిగా కుదుటపడలేదని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం కు ముందు రోహిణిని యాంకర్ గా అనుకోని ఉంటారు. ఆమె ఆల్రెడీ సైన్ చేయడంతో వేరే ఆప్షన్ లేక ఆమె యాంకరింగ్ చేయాల్సి రావడంతో ఇలా వీల్ చైర్ లోనే వచ్చిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుందని, కొద్దిగా నొప్పి ఉన్నా భరించి రోహిణి నడుస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version