NTV Telugu Site icon

Jabardasth Sailekha: సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన సాయి.. ?

Sai

Sai

Jabardasth Sai: లింగ మార్పిడి అనేది తప్పు కాదు.. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న.. ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న చాలా ప్రాసెస్ ఉండేది. వాళ్ళు అలా మారక కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కోవల్సివచ్చేది. చిన్నతనం నుంచి వచ్చిన ఆ లోపం వలన చుట్టూ ఉన్నవారితో ఎన్నో అవమానాలు పడేవారు.. కానీ, ఇప్పుడిప్పుడే లోకం మారుతోంది. వారిది కూడా ఒక జీవితమే అని అర్ధం చేసుకోవడం మొదలయ్యింది. లీగల్ గా వారికి హక్కులు ఉన్నాయి అని న్యాయస్థానాలే చెప్పుకొచ్చాయి. దీంతో చాలామంది తమను తాము.. తమకు నచ్చినవిధంగా మార్చుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో లేడీ గెటప్స్ వేసేవారిని వారి ఒరిజినల్ రూపంలో చూస్తే గుర్తుపట్టడం కష్టమే.. మొదట్లో ఎబెట్టుగా ఉన్నా కూడా.. చూడగా చూడగా వాళ్లు కూడా ప్రేక్షకులకు అలాగే అలవాటు పడిపోయారు. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్ ద్వారా ఫేమస్ అయ్యిన పింకీ.. బిగ్ బాస్ కు వెళ్లి అందరి మన్ననులు అందుకుంది.

Nandamuri Balakrishna: సినిమా ఏదైనా.. జై బాలయ్య కామన్ రా..

సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా మారింది. ఇక లింగ మార్పిడి చేయించుకోకుండానే.. మరో జబర్దస్త్ నటుడు.. అమ్మాయిగా మారాడు. అతడే.. సాయి. అదే.. సాయి లేఖ. ఎన్నో స్కిట్స్ లో తన అందంతో మెస్మరైజ్ చేసిన ఆమె.. ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని లేడీగా మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె స్పందించింది. తాను సర్జరీ చేయించుకోలేదని, సర్జరీ చేయించుకొంటేనే అమ్మాయిగా మారతారా.. ? నాకు చిన్నతనం నుంచి చీరలు కట్టుకోవడం ఇష్టం.. ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటినుంచే మొదలయ్యాయి. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం.. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను.. నేను ఇలానే ఉంటాను. నేను సర్జరీ చేయించుకుంటే వారికెందుకు.. ? లేకపోతే వారికెందుకు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.