NTV Telugu Site icon

Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు

Pavitra

Pavitra

Pavitra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రోహిణి టీమ్ లీడర్ గా చేస్తున్న ఈ టీమ్ లో పవిత్ర కంటెస్టెంట్ గా చేస్తుంది. జబర్దస్త్ కు వచ్చిన దగ్గరనుంచి ఆమె తన ట్యాలెంట్ తో ఆనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈవెంట్స్, షోస్ అంటూ ఖాళీ లేకుండా తిరుగుతున్న పవిత్ర.. మొట్ట మొదటిసారి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని విప్పింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపిన ఆమె ఈ స్థితికి వస్తానని కూడా అనుకోలేదని ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తన తల్లిదండ్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

” మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. మా నాన్న పచ్చి తాగుబోతు. ఒక్కోసారి తాగేసి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. మా అమ్మ నన్ను పెంచింది. 13 ఏళ్లు మా నాన్నతో నేను మాట్లాడలేదు. తండ్రి ప్రేమకు చిన్నప్పుడే దూరమయ్యాను. కాలేజ్ లో ఉన్నప్పుడు నా జోక్స్ కు నా స్నేహితులు పడిపడి నవ్వేవారు. కామెడీ షోలు చూస్తూ నేను కూడా కామెడీ చేయడం నేర్చుకున్నాను. మాకు సొంత ఇల్లు కూడా లేదు.. కాలేజ్ తరువాత ఒక సెలూన్ కూడా పెట్టా.. కానీ అది ప్లాప్ అయ్యింది. ఇక ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోయారని తెలిసి సంతోషించాను. ఆయన వలనే నేను, మా అమ్మ ఇలా అయ్యాం.. ఆయన బావుండి ఉంటే మేము వేరే లెవల్ లో ఉండేవాళ్లం ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments