Site icon NTV Telugu

Jabardasth Avinash: పురిటిలోనే బిడ్డను కోల్పోయాను.. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు

Avinash

Avinash

Jabardasth Avinash: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమె తల్లి అయ్యినట్లే. ఎన్నో ఆశలతో కడుపులోని బిడ్డను పెంచుతూ వస్తుంది. కబుర్లు ఆ బిడ్డతోనే.. అలకలు ఆ బిడ్డతోనే. ఇక తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా ఎప్పుడెప్పుడు తన చిన్నారి బయటకు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక మరో కొన్ని గంటల్లో బిడ్డ భూమి మీదకు వస్తుంది అనుకొనేలోపు.. ఆ బిడ్డ మరణిస్తే.. ఆ బార్యాభర్తలకు అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదు. ప్రస్తుతం ముక్కు అవినాష్- అనూజ ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో మల్లెమాలను వదిలి బిగ్ బాస్ కు వెళ్ళాడు. అక్కడ మంచి గుర్తింపును తెచ్చుకొని బయటకు వచ్చాడు. కమెడియన్ గా షోస్ చేస్తూనే కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇక రెండేళ్ల క్రితం అవినాష్.. అనూజ ను వివాహమాడాడు. గతేడాది ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఇక అవినాష్ .. నిత్యం అనూజ ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఒక షోలో అనూజకు సెలబ్రిటీలు అందరూ సీమంతం కూడా జరిపించారు.

ఇక జనవరి 7 న అవినాష్ హృదయం ముక్కలు అయ్యే విషయాన్నీ చెప్పాడు. తన బిడ్డ పురిటిలోనే మరణించింది అని, దయచేసి అర్డంచేసుకొని తమను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని కోరాడు. దీంతో అవినాష్ అభిమానులు ఎంతో బాధపడ్డారు. అంత బాధను దిగమింగుకొని అవినాష్ షోస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఈ విషయమై అవినాష్ ఎప్పుడు మాట్లాడలేదు. ఇక తాజాగా ఈ విషయమై స్పందించాడు. ” నా బిడ్డ చనిపోయినప్పుడు.. ఇండస్ట్రీ నుంచి ఎన్నో కాల్స్ వచ్చాయి. ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. నేను అస్సలు మాట్లాడే స్థితిలో కూడా లేను. దీనిగురించి మాట్లాడకండి అని చెప్పినా కూడా నా మీద ఉన్న ప్రేమతో చాలామంది అడిగారు. వారందరికీ నా ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోని మేఘం. దేవుడు మాకు అలా రాసిపెట్టి ఉంచాడు. భవిష్యత్తు లో దీనికి మించి వస్తుందేమో చూడాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version