NTV Telugu Site icon

Anchor Sowmya: జబర్దస్త్ కొత్త యాంకర్ అమ్మ గురించి ఎమోషనల్ పోస్ట్…

Sowmya

Sowmya

ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త కమెడియన్స్ ని ఇచ్చిన ఈ షో వేణు లాంటి దర్శకుడిని కూడా ఇచ్చింది. కమెడియన్స్ కి మాత్రమే కాదు యాంకర్లకి కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఊహించని పాపులారిటీ తెచ్చాయి. రష్మీ, అనసూయలు గ్లామర్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోని, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే దానికి కారణం ఈ కామెడీ షోలే. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కంటిన్యు అవుతుంది కానీ అనసూయ మాత్రం సినిమాల్లో బిజీ అయ్యి షో మానేసింది. అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది ‘సౌమ్య’. వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న సౌమ్యకి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సౌమ్య, తన ఇన్స్టాలో చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సౌమ్య అమ్మగారు ఇటీవలే మరణించారు. మదర్స్ డే రోజున అమ్మని తలుచుకుంటూ సౌమ్య ఇన్స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఎమోషనల్ చేస్తోంది.

‘అంబులెన్స్‌, డాక్టర్స్‌.. ట్రీట్‌మెంట్‌.. మందులు ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ దేవుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు చేశాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడని బాధ కలుగుతోంది. అందరూ అమ్మ ఫోటో షేర్‌ చేసి మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధ గుర్తొస్తోంది. దానిని నేను మర్చిపోలేకపోతున్నాను. రాత్రింబవళ్లు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు’’ అంటూ కన్నడలో సౌమ్య ఎమోషనల్ పోస్ట్ చేసింది.