J. D. Chakravarthy Says content in prince: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసన్ , కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ గురించి మీడియా సమావేశంలో పలు కీలకమైన విషయాలు ఆయన పంచుకున్నారు జేడీ చక్రవర్తి. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కంటెంట్ ఈజ్ కింగ్ అని తాను నమ్మనని కంటెంట్ అనేది ప్రిన్స్ అని చెప్పుకొచ్చారు ఆయన. డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేనని పేర్కొన్న జేడీ దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుందని అన్నారు. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించానని పేర్కొన్న ఆయన కథ మనకున్న స్థలం లాంటిదైతే అందులో అందమైన ఇల్లు కట్టడం డైరెక్షన్ లాంటిదని అన్నారు. ఇక సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
Danger Pilla: ఆమ్మో ‘డేంజర్ పిల్ల’ అంటున్న నితిన్
ఇక ఈ సిరీస్ లో ఎలా భాగం అయ్యాను అనే విషయం మీద ఆయన మాట్లాడుతూ హాట్ స్టార్ నుంచి దయా వెబ్ సిరీస్ కోసం నన్ను తరుచూ సంప్రదిస్తూ ఉండేవారని నేను సిరీస్ చేసే మూడ్ లో లేనని, బిజీ అని ఈ సిరీస్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను కానీ వాళ్లు మాత్రం వదలలేదని అన్నారు. సినాప్సిస్ వినండి అని స్క్రిప్ట్ పంపి ఆ తర్వాత డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్ లో పది నిమిషాలు కథ వినిపించాడని అన్నారు. పర్సనల్ గా వచ్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్తా అని వచ్చినా నేను స్టోరీ వినకుండానే దయా వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పానని అన్నారు. ఎందుకంటే నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయని, ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారని అన్నారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసిందని దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పానని ఆయన అన్నారు.