NTV Telugu Site icon

Virupaksha: హిట్ కొడతాడు అనుకున్నారు కానీ ఈ రేంజ్ ర్యాంపేజ్ ఊహించలేదు

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన సినిమా ‘విరుపాక్ష’. ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ నుంచి ‘స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్’ అనే టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో విరుపాక్ష సినిమా ఫస్ట్ డే ఈవెనింగ్ షోస్ నుంచే బుకింగ్స్ లో గ్రోత్ మొదలయ్యింది. డే 12 కోట్లు రాబట్టిన ఈ థ్రిల్లర్, మూడో రోజు ఏకంగా 16 కోట్లని రాబట్టింది అంటే బుకింగ్స్ ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. డే 1, డే 2 కన్నా డే 3 ఎక్కువగా ఉండడం విరుపాక్ష సక్సస్ కి నిదర్శనం. ఓవరాల్ గా మూడు రోజుల్లో విరుపాక్ష సినిమా వరల్డ్ వైడ్ గా 44 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ఈరోజు టచ్ చేసే ఛాన్స్ ఉంది. 22 కోట్ల వరకూ ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న విరుపాక్ష సినిమా ఇప్పటికే 95% రికవర్ చేసేసింది. బాలన్స్ ఈరోజు ఈవెనింగ్ షో సమయానికి రాబట్టేస్తే మూడున్నర రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన మొదటి సాయి ధరమ్ తేజ్ సినిమాగా చరిత్రకెక్కుతుంది.

యాక్సిడెంట్ తర్వాత తేజ్ చేసిన ఈ సినిమాతో కంబ్యాక్ హిట్ ఇస్తాడని అంతా అనుకున్నారు కానీ ఈ రేంజ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. విరుపాక్ష సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ తెలుగు రిలీజ్ కి మాత్రమే స్టిక్ అయ్యారు, ఇప్పుడు తెలుగు కలెక్షన్స్ ఇచ్చిన జోష్ తో పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తే విరుపాక్ష సినిమా ఈజీగా వంద కోట్ల మార్కెట్ లోకి చేరిపోతుంది. గూస్ బంప్స్ ఇచ్చే సౌండ్ డిజైన్, స్టెల్లార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్, హార్రిఫయ్యింగ్ ఆర్ట్ వర్క్, ఇంటెల్లిజెంట్ స్క్రీన్ ప్లే… లాంటి అంశాలు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యి విరుపాక్ష సినిమాని ఈ మధ్య కాలంలో చూసిన ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. దీన్ని మరింత కాష్ చేసుకోవాలి అంటే మేకర్స్, తెలుగు బౌండరీలు దాటి పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్లాల్సిందే.