పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్ 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి జూన్ 16 వరకు థియేటర్లన్నీ రాముడిగా ఉన్న ప్రభాస్ కటౌట్స్‌తో నిండిపోనున్నాయి. జూన్ నెల మొత్తంగా ఆదిపురుష్ సందడి ఉండనుంది. కానీ గత 90 రోజులుగా యూట్యూబ్‌లో ఆదిపురుష్‌దే హవా నడుస్తోంది.
Read Also: Vishwak Sen: #VS11 మాస్ కా దాస్ వస్తున్నాడు…
మూడు నెలలుగా యూట్యూబ్‌లో అత్యధికంగా వెతికిన టాపిక్‌గా ఆదిపురుష్ ట్రైలర్ నిలిచింది. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేసేసింది. ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ని అందుకొని.. ప్రభాస్ కెరీర్లో మరో 100 మిలియన్ వ్యూస్ కలిగిన సాంగ్‌గా నిలిచింది. నెక్స్ట్ సాంగ్ పై కూడా గూస్ బంప్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒక్క యూట్యూబ్ అనే కాదు.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా అన్నింటిలోను ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చే వరకు బిజినెస్, వ్యూస్, లైక్స్ లాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ లెక్కలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని చెప్పొచ్చు.
