Site icon NTV Telugu

Ravanasura: క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది…

Ravanasura

Ravanasura

బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీ సినిమాలు ఇచ్చిన జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రావణాసుర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, మేఘా ఆకాష్ లపై సాంగ్ ని షూట్ చేస్తున్నారు. స్టూడియోలో వేసిన భారి సెట్ లో, శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో రావణాసుర షూటింగ్ పార్ట్ వరకూ పూర్తవుతుంది. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ కారణంగా రావణాసుర షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి వ్రాప్ అప్ చెయ్యగలిగారు.

Read Also: Mega Power Star: ఆ ఘటన సాధించిన మొదటి ఇండియన్ హీరో చరణ్ మాత్రమే…

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురుడు వేసవిలో విడుదలవ్వనుంది. మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా బయటకి వచ్చిన టీజర్ లో రవితేజ పాత్రలో ఉన్న డిఫరెంట్ షెడ్స్ ని చూపించగా, ‘రావణాసుర థీమ్ సాంగ్’కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథని ఇవ్వగా, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో రావణాసుర చిత్రాన్ని స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారడు. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది కాబట్టి చిత్ర యూనిట్ ఇలానే మంచి కంటెంట్ ని రిలీజ్ చేస్తూ పాజిటివ్ బజ్ ని ఇలానే మైంటైన్ చేస్తే రవితేజ హ్యాట్రిక్ కొట్టేసినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని ఈ రావణాసురుడు ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు.

Exit mobile version