Site icon NTV Telugu

“చియాన్ 60” షూటింగ్ పూర్తి

Its a wrap for Chiyaan 60

‘చియాన్ 60’ తమిళంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీం మొత్తం కలిసి కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి “చియాన్60″కి గుమ్మడికాయ కొట్టేశారు.

Read Also : ఆసక్తికరంగా “క్రేజీ అంకుల్స్” ట్రైలర్

ఈ యాక్షన్ డ్రామాలో ధృవ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, అతని తండ్రి మరియు నటుడు విక్రమ్ మూడు విభిన్న గెటప్స్ లో కన్పించారు. ఇక నేడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి ఉత్తేజకరమైన అప్‌డేట్ వస్తుందని విక్రమ్ అభిమానులు ఆశిస్తున్నారు. ‘చియాన్ 60’ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిమ్రాన్, వాణి భోజన్ , బాబీ సింహా తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version