‘కొత్తగా మా ప్రయాణం’ ఫేమ్ ఈశ్వర్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సూర్యాపేట్ జంక్షన్’. ఇప్పటికే కన్నడ, మలయాళ చిత్రాలలో నాయికగా నటించిన నైనా సర్వర్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘కథనం’ ఫేమ్ నాదెండ్ల రాజేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్. ఎస్ రావు, విష్ణువర్ధన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు రాజీవ్ సాలూరు, గౌర హరి సంగీతం సమకూర్చుతున్నారు. హైదరాబాద్, సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఈ సందర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ” ‘కొత్తగా మా ప్రయాణం’ తర్వాత నేను చేస్తున్న రెండో సినిమా ఇది. కొవిడ్ తర్వాత నేను రాసుకున్న సబ్జెక్ట్ ఇది. దర్శకుడు నాదెళ్ళ రాజేశ్ కు ఈ పాయింట్ నచ్చడంతో ఇద్దరం కలిసి రెండు సంవత్సరాల నుండి దీనిని డెవలప్ చేశాం. నిర్మాతలకూ ఈ కథ నచ్చడంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇటీవల మొయినాబాద్ లో ఒక ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసి చాలా రిచ్ గా చిత్రీకరించాం. దీనితో షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు నాదెండ్ల రాజేష్ మాట్లాడుతూ, ” ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ గా కీ-రోల్ చేస్తున్నాడు. చమ్మక్ చంద్ర, బాషా, లక్ష్మణ్ సూర్య, హరీష్ ఇలా చాలా మంది ఈ సినిమాలో చాలా చక్కని పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా దీనిని నిర్మించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని చెప్పారు.