హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఇవే
కాగా గత మూడు రోజులుగా సినీ ప్రముఖులపై జరుగుతున్న ఐటీ సోదాలు నేడు ముగిసాయి. గత అర్ధరాత్రి తో అన్నిచోట్ల ఈ సోదాలు ముగిసాయి. మొత్తం ఈ సోదాలు మూడు రోజులపాటు దాదాపుగా 16 చోట్ల సోదాలు నిర్వహించారు ఐటి అధికారులు. దాదాపుగా 55 టీమ్ లతో టాలీవుడ్ సినీ నిర్మాతలుతో పాటు డైరెక్టర్ లపై సోదాలు నిర్వహించిన ఐటీ. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను టార్గెట్ గా సోదాలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సంబందించిన కలెక్షన్స్ తదితర వ్యవహారంపై ఆ సినిమా నిర్మాతలతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో తనిఖీలు చేసారు. డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో రెండు రోజుల పాటు సోదాలు చేసారు అధికారులు. ఇటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో సంస్థతో పాటు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో, ఆఫీసులోను మూడు రోజులు పాటు ఐటీ దాడులు నిర్వహించింది. మరొక ఫైనాన్సర్ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరుకు చెందిన ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులుసోదాలు చేసారు.