NTV Telugu Site icon

Abhishek Agarwal: పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఆఫీసలో ఐటీ సోదాలు…

Abhishek

Abhishek

కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, వ్యాక్సిన్ వార్, నెక్స్ట్ నిఖిల్ తో ‘ది ఇండియా హౌజ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు నిర్మాత అభిషేక్ అగర్వాల్. భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు సినిమాని నార్త్ లో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న అభిషేక్‌ అగర్వాల్ కార్యాలయంపై ఐటీ శాఖ దాడులు చేసాయి. హైదరాబాద్ లోని అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

Read Also: 5Years For Aravinda Sametha: ఫ్యాక్షన్ సినిమాలకి టార్చ్ బేరర్…

ఏదైనా స్టార్ హీరో నటించిన పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే ఐటీ సోదాలు చేయడం అనేది ఈ మధ్య మాములు విషయం అయిపొయింది. బాహుబలి నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకూ అన్ని పెద్ద సినిమాల నిర్మాతలు ఐటీ సోదాలని ఫేస్ చేసిన వారే. ఈ సోదాల కారణంగా టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజ్ కి వచ్చే కష్టం అయితే ఉండకపోవచ్చు. అనుకున్నట్లుగానే దసరాకి టైగర్ నాగేశ్వర రావు థియేటర్స్ లోకి వచ్చి పాన్ ఇండియా హిట్ అవుతుందేమో చూడాలి.