హైదరాబాద్ లో ఐటి అధికారులు నిన్నటి నుండి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది అధికారులు ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
Also Read : Ravi Basrur : డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్
ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో భాగంగా పుష్ప -2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అలాగే పుష్ప -2 మేకర్స్ కు చెందిన ఆఫీసుల్లోనూ దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక విషయాలను కనుగొన్నారు ఐటి అధికారులు. పుష్ప -2 మేకర్స్ ను విచారించిన అధికారులు పుష్ప 2 వరల్డ్ వైడ్ గా సాధించిన వసూళ్లకు తగ్గట్లుగా నిర్మాతలు ఐటీ చెల్లింపులు జరగలేదని కనుగొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పుష్ప నిర్మాతలకు చెందిన బ్యాంక్ లావాదేవీలు పరిశీలన చేస్తున్నారు. మరో నిర్మాత ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారు. ఈ ఇద్దరి నిర్మాతలతో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి చేసిన అధినేత ఇంట్లో అలాగే ఆఫీసులో రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.