హైదరాబాద్ లో తెల్లవారుజాము నుండి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 200 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
Also Read : VD 12 : విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా రిలీజ్ డేట్ ఇదే ..?
ఇటీవల సంక్రాంతికి విడుదలైన రెండు స్టార్ హీరోల సినిమాలు నిర్మించిన సినీ నిర్మాత నివాసంతో పాటు, ఆఫీసు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రముఖ ఆ నిర్మాత సోదరుడు, కుమార్తె నివాసంలో కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు గతేడాది చివర్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సాధించిన చిత్ర నిర్మాత ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థల్లో కీలకమైన ముగ్గురు ఇళ్లలోను ఐటి అధికారులు ఈ తెల్లవారు జామున నుండి సోదాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాణానికి చెందిన లావాదేవీలు, కలెక్షన్స్ తదితర వివరాలపై అరా తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి నిర్మాతలతో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి చేసిన అధినేత ఇంట్లో అలాగే ఆఫీసులో రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సుమారు మూడు గంటల నుండి ఈ రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం.