NTV Telugu Site icon

Isha Koppikar: నాగ్ హీరోయిన్ విడాకులు.. కూతురుతో కలిసి బయటకు.. ?

Isha

Isha

Isha Koppikar: ఇషా కొప్పికర్.. ఈ తరం యువతకు ఈమె తెలియకపోవచ్చ. కానీ, నాగార్జున ఫ్యాన్స్ కు కచ్చితంగా ఆమె గుర్తుండి ఉంటుంది. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో ఇషానే హీరోయిన్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. నిఖిల్ నటించిన కేశవ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఇషా.. తన భర్త టిమ్మి నారంగ్ తో విడాకులు కావాలని కోరినట్లు తెలుస్తోంది. 14 ఏళ్ళ వివాహబంధానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇషా, రెస్టారెంట్ ఓనర్ అయిన టిమ్మి నారంగ్ మూడేళ్లు ప్రేమించుకొని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి రియానా నారంగ్ అనే కూతురు కూడా ఉంది. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. కొన్ని నెలలుగా కలహాల మధ్య కాపురం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కలహాలను తట్టుకోలేని ఇషా.. కూతురు ను తీసుకొని బయటకు వచ్చినట్లు వినికిడి.

ఇక మీడియా ముందు ఆమె.. తమ విడాకులు డైరెక్ట్ గా రివీల్ చేయకపోయినా.. ఇక్కడ చెప్పడానికి ఏమి లేదు.. నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. దయచేసి దీని గురించి ఎవరు అడగొద్దు. నాకు కొంచెం ప్రైవసీ కావాలి. ఏమి నేను చెప్పను అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇషా.. టిమ్మితో విడాకులు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇషా.. కోలీవుడ్ లో అయలాన్ సినిమాలో నటిస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Show comments