Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Is This The Reason Behind Chiru And Prakash Raj Movie Promotions

చిరంజీవి – ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గట్లేదు!

Published Date :September 6, 2021 , 8:14 pm
By ramakrishna
చిరంజీవి – ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గట్లేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిరంజీవి సోమవారం గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ చూసి, దర్శకుడు సంపత్ నందితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ టీజర్ ను సైతం చిరంజీవి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘క్లాప్’ విజయం కావాలని కోరుకున్నారు. చిత్రం ఏమంటే… గత కొన్ని రోజులుగా చిరంజీవి ఎడాపెడా పలు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తన నివాసం నుండే జరుపుతున్నారు. అడగటం ఆలస్యం అన్నట్టుగా వారికి తన మాట సాయం అందించి, మూవీస్ కి ప్రచారం చేసిపెడుతున్నారు. ఇది అభినందించదగ్గదే.

జాగ్రత్తగా గమనిస్తే… ఇదే పని గత కొన్ని రోజులుగా జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం చేస్తున్నారు. గతంలో పరాయి చిత్రాల ప్రచారానికీ, మీడియాకు శుభాకాంక్షలు చెప్పడానికి ససేమిరా అంటుండే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు ఫ్రెండ్లీ స్టార్ అయిపోయారు. చిన్న చితకా సినిమాల దర్శక నిర్మాతలు కోరినా… వాళ్ళ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియోస్, పాటలు, ప్రచార చిత్రాలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆదివారం కూడా ‘1997’ అనే సినిమాకు సంబంధించి హీరో డాక్టర్ మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే… జాగ్రత్తగా గమనిస్తే… వీరి విశాల హృదయ ప్రదర్శన వెనుక త్వరలో జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కారణం కాదు కదా! అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Also Read

  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
  • Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
  • NBK112 : బాలయ్య - కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?
  • AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

నిజానికి చిరంజీవి గతంలోనూ తనకు నచ్చిన, తాను మెచ్చిన సినిమాలను, సినిమా వాళ్ళనూ మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించారు. కాకపోతే… ఇప్పుడది మరింత విస్తారంగా జరుగుతోంది. అలానే ప్రకాశ్ రాజ్ సైతం తన సహాయసహకారాలను సమాజంలోని అన్ని వర్గాలకూ అందించే నైజం ఉన్నవారే. కానీ ఇప్పుడు మాత్రం ‘మా’ ఎన్నికల కారణంగా ఇదంతా చేస్తున్నారేమోననే సందేహం కొందరికి కలుగుతోంది. ‘మా’ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో సంబంధం లేకుండా ఇదే విధంగా చిన్న సినిమాలను వీరు ప్రోత్సహిస్తే… ఆ విమర్శకుల నోళ్ళును మూసినట్టు అవుతుంది. అదే జరగాలని కోరుకుందాం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MAA Elections 2021
  • megastar chiranjeevi
  • Movie Promotions
  • Prakash Raj

తాజావార్తలు

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

  • Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం

  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions