Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్, రాజమౌళి కాంబినేషన్ సాధ్యమేనా!?

Pawan

Pawan

సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కలయికలో సినిమా అన్నదే ఆ రూమర్. నిజానికి గతంలో పవన్ ను రెండు సార్లు సినిమా విషయమై కలసినప్పటికీ వర్కవుట్ కాలేదని ఓ సందర్భంలో రాజమౌళి వెల్లడించారు. పవన్ కూడా ‘బాహుబలి’ సినిమాను అది తీసినవారిని పలుమార్లు ప్రశంసలతో ముంచెత్తారు.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఇది ఎప్పటి నుంచి ఆరంభం అవుతుంది. ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. సో… రాజమౌళి మహేష్‌ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌కు వెళ్లి 2024 చివరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. అవన్నీ పూర్తవటానికి ఎలా లేదన్నా 2024 ఎండ్ అవుతుంది. ఆ తర్వాత పవన్ ఎన్నికల్లో బిజీ అవుతాడు. అవి పూర్తి చేసుకుని రావటానికి ఎలా లేదన్నా ఏడాది పైనే పడుతుంది. అసలు రాజకీయ సమీకరణాలు ఇప్పటి వరకూ తేలలేదు. సో రాజమౌళి, పవన్ సినిమా అనే ప్రస్తుతానికి మీడియాలో రూమర్ గా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ ఓ బడా నిర్మాత పవన్, రాజమౌళి కాంబినేషన్ కి ట్రై చేస్తున్నాడని వినిపిస్తోంది. పవన్ ఎలక్షన్స్ తర్వాత సినిమాల్లోకి వస్తే ముందుగా రాజమౌళి సినిమాతోనే వస్తాడట. ఈ సూపర్ రూమర్ నిజం అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కి పండగే. మరి ఈ రూమర్ రూమర్ గానే మిగిలిపోతుందా? లేక కార్యరూపం దాల్చుతుందా? అన్నది చూడాలి.

Exit mobile version