Site icon NTV Telugu

VV. Vinayak: ఎన్టీఆర్ తో కొడాలి నాని తెగదెంపులు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసు

Ntr

Ntr

VV. Vinayak: జూనియర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్టీఆర్, కొడాలి నానితో తెగదెంపులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవరికి తెలియని మిస్టరీ. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని టాక్. అయితే మొదటి నుంచి వీరి స్నేహం ఎంతో బలమైంది అని చెప్తూ ఉంటారు. ఆది సినిమా నిర్మాణంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించాడట. ఇక తాజాగా వీరి స్నేహం విడిపోవడానికి ప్రధాన కారణాలను ఆది డైరెక్టర్ వివి వినాయక్ బయటపెట్టాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “జూనియర్ ఎన్టీఆర్ -కొడాలి నాని చాలా మంచి స్నేహితులు. ఒక్కసారిగా రాజకీయ కోణం రావడంతో వారిద్దరూ విడిపోయారు. నాని వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఒకరికొకరు సంబంధాలు తెగిపోయాయి. అప్పటి వరకు వారు అన్ని సమయాలలో కలిసి ఉన్నారు. పార్టీలు -కుటుంబాలు వారి మధ్య అంతరాన్ని పెంచాయి. నాని వైసీపీలో చేరిన రోజే ఎన్టీఆర్ అతనితో తెగదెంపులు చేసుకున్నాడు అని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ చాలా కంఫర్ట్ మనిషి. అతడు ఒక్కసారి స్నేహం చేశాడు అంటే వదిలిపెట్టడు. అయితే అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో.. ఎవరికి ఎక్కడ హద్దు పెట్టాలో బాగా తెలుసు” అని చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్తులో ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా అంటే.. ఏమో అవుతుందేమో చెప్పలేం అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version