NTV Telugu Site icon

SSMB29 : మహేష్,రాజమౌళి మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?

Whatsapp Image 2024 04 30 At 7.40.23 Am

Whatsapp Image 2024 04 30 At 7.40.23 Am

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్‌డేట్‌లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉందబోతుందో కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్‌ పలు హింట్స్ అందించారు. రాజమౌళి,నేను దక్షిణాఫ్రికా నవలా రచయిత అయిన విల్బర్‌ స్మిత్‌కు బిగ్ ఫ్యాన్స్ అని ఆయన తెలిపారు. ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్‌ని రాసినట్లుగా ఆయన ఓ వేదికపై తెలిపారు.హనుమంతుడిని పోలిన లక్షణాలతో ఇందులో మహేశ్‌ పాత్రను రాజమౌళి డిజైన్‌ చేసినట్టు సమాచారం.

ఇదిలా వుంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ఓ విదేశీభామ నటిస్తున్నట్లు సమాచారం .అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలియాభట్‌ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రెస్ మీట్ ని సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజైన మే 31న నిర్వహించనున్నట్టు గతంలో తెగ వార్తలు వచ్చాయి.అలాగే మహేశ్‌ పుట్టినరోజైన ఆగస్ట్‌ 9న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.రాజమౌళి ఈ సినిమాను తనదైన మార్క్‌ యాక్షన్ సీక్వెన్స్ లతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కె.ఎల్‌.నారాయణ ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.