NTV Telugu Site icon

Dunki: సలార్ ను తొక్కేయడానికే షారుఖ్ ఈ పని చేస్తున్నాడా.. ?

Salaar

Salaar

Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఇక సినిమా మీద నమ్మకంతో, మేకర్స్ మీద నమ్మకం ఉంటే.. ఎంత పెద్ద సినిమా పోటీలో ఉన్నా కూడా రంగంలోకి దించేస్తారు. అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇప్పుడు డిసెంబర్ గురించి మాట్లాడితే.. రెండు పెద్ద సినిమాలు.. రెండూ పాన్ ఇండియా సినిమాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. ఈ రెండు సినిమాల కోసం సినీ ప్రేక్షకులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలు ఏంటో ఈపాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డుంకీ. ఈ రెండు సినిమాలపైనే చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తుంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డుంకీ.. డిసెంబర్ 22 న వస్తుందని చెప్తూనే వస్తున్నారు. బాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా హిరానీ కి పేరు ఉంది. ఆయన సినిమా అంటే తెలుగువారు సైతం క్యూ కడతారు. డిసెంబర్ 22 అనేసరికి తెలుగువారు కూడా.. డుంకీ కోసం ఎదురుచూసారు. అయితే.. ఇదంతా ఎప్పటివరకు అంటే .. సలార్ రిలీజ్ డేట్ రానంతవరకు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. లేస్తూ.. ఎట్టకేలకు డిసెంబర్ 22 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటన.. ఎన్నో సినిమాలు వెనక్కి, ముందుకు వెళ్లేలా చేసాయి. కానీ, డుంకీ మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది.

ప్రభాస్ తో పోటీ పడి నెగ్గుకురాలేం అని వెనక్కి తగ్గుతారేమో అని.. ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్నా కూడా షారుఖ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ అదే డేట్ కు రావాలని మంకు పట్టు పట్టుకొని కూర్చొన్నాడు. ఇక ప్రభాస్ తో పోటీ అంటే కష్టం అనుకున్నాడో ఏమో.. సలార్ ను దెబ్బ తీసే ప్లాన్ తో వచ్చేసాడు. అదే సలార్ కన్నా ఒక్కరోజు ముందు వస్తున్నట్లు ప్రకటించాడు. డిసెంబర్ 21 న డుంకీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే డిసెంబర్ 20 న ఓవర్సీస్ లో ఈ సినిమా పడుతుంది. అక్కడ కనుక పాజిటివ్ టాక్ వచ్చింది అంటే.. బాలీవుడ్ లో డుంకీ ఆపడం ఎవరి తరం కాదు.

ముఖ్యంగా స్క్రీన్స్ ను లాగేస్తారు. సలార్ ఒక్కరోజు వెనుక వచ్చి హిట్ అందుకున్నా కూడా.. షారుఖ్ కు ఉన్న క్రేజ్ వలన స్క్రీన్స్ తక్కువే వస్తాయని అంచనా.. ఇండియా మొత్తం మీద 8, 500 స్క్రీన్స్ ఉండగా.. ఒకవేళ డుంకీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. దాదాపు 5000 స్క్రీన్స్ దానికే పోతాయి. ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ లెక్కన సలార్ కు కౌంట్ తగ్గే అవకాశం మెండుగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదైమైనా సలార్ ను తొక్కేయడానికే షారుఖ్ అండ్ టీమ్ ఈ విధంగా ప్లాన్ చేశారు అని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.