Rana : హీరో రానా తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు రానా స్పందించలేదు. కానీ ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నాడంట. ప్రస్తుతం మిహికా బజాజ్ గర్భం దాల్చడంతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రానా విషయంలో కూడా ఇలాంటి న్యూస్ వైరల్ అవుతోంది.
Read Also : Allu Aravind : బన్నీవాసును పొట్టుపొట్టు తిట్టిన అల్లు అరవింద్..
గతంలో కూడా రానా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని అప్పట్లోనే రానా, మిహికా కొట్టి పారేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలు వస్తున్నా దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించట్లేదు. మరి ఈ వార్తలు నిజమేనా లేదంటే రూమర్లా అనేది తెలియాలంటే రానా స్పందించాల్సిందే. ప్రస్తుతం రానా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మిరాయ్ సినిమాలో రానా నటిస్తాడనేది తెలిసిపోయింది. హీరోగానే కాకుండా ఇలా విలన్ గా కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.
Read Also : Mohan Lal : మోహన్ లాల్ కు భారీ ఎదురుదెబ్బ..
