Site icon NTV Telugu

నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?

Ram-Charan

దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలకు దాదాపు 50 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు దానిని డబుల్ చేశాడని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

https://ntvtelugu.com/bollywood-star-salman-khan-bitten-by-a-non-venomous-snake/

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశాడని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్‌కి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేశాడంటూ వస్తున్న షాకింగ్ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత చరణ్ తన స్టార్‌ డమ్‌ లో పెద్ద మార్పును అంచనా వేస్తున్నాడు చరణ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను సైతం ఇలా రెమ్యూనరేషన్ పెంచేసి ఉపయోగించుకుంటున్నాడు అని అంటున్నారు. తన నెక్స్ట్ సినిమాల్లో ఒక్కో సినిమాకు చెర్రీ వంద కోట్లు వసూలు చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ హిట్ అయితే గనుక చరణ్ తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచే అవకాశం ఉంది.

ఈ మెగా హీరో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను పూర్తి చేసిన తర్వాత ‘ఆర్సీ 15’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ కోసం డేట్స్ ను కేటాయించనున్నాడు చరణ్.

Exit mobile version