NTV Telugu Site icon

Kanguva-Matka: కంగువా – మట్కా : మ్యూజిక్ డైరెక్టర్లదే పాపమా?

Matka Kanguva

Matka Kanguva

నవంబర్ 14వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రంతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలకు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే నిజానికి ఎక్కువగా సినిమా బాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. అయితే ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే రెండూ పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కించారు. అయితే ఒకటి రాజుల కాలం నాటి కథ మరొకటి 80 కాలాన్ని నాటి కథ. ఈ రెండు సినిమాలలో వినిపించిన మైనస్ పాయింట్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. అందులో కంగువా సినిమాకి దేవిశ్రీప్రసాద్ పనిచేయగా మట్కా సినిమాకి మరో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ పనిచేశాడు.

Nani : మలయాళ దర్శకుడుతో నాని సినిమా

ఈ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం బాగా వర్కౌట్ అయింది కూడా. కానీ నిన్నటి సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కంప్లైంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే అసలు విషయం ఏమిటంటే కొంతమంది ఏకంగా ఈ ఇద్దరి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగో లేకపోవడం వల్లే సినిమాలు ఎలివేట్ అవ్వలేదు అనే విధంగా కూడా మాట్లాడారు. అయితే నిజానికి సినిమా కంటెంట్ బాగుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు ఇవ్వడానికి సంగీత దర్శకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో ఇదే విషయాన్ని ఒకసారి తమన్ కూడా ప్రస్తావించారు.. అసలు విషయం ఏమిటంటే కంటెంట్ కి స్కోప్ ఉంటే ఎంత అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా పాటలు అయినా ఇవ్వవచ్చు. ఆ స్కోప్ లేనప్పుడు ఎంత ఇచ్చిన అది సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఈ విషయాన్ని గుర్తించి కామెంట్స్ చేస్తే బెటర్.

Show comments