Site icon NTV Telugu

Salman Khan : పవన్ తో కానిది సల్మాన్ వల్ల అవుతుందా!?

Salman

Salman

స్టార్ హీరోల జడ్డిమెంట్ ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. ఒక్కో సారి ప్లాఫ్ అయిన సినిమాల రీమేక్ కు యస్ అంటారు. హిట్ అయిన సినిమా చేయటానికి ఆలోచిస్తుంటారు. అంతే కాదు ఒక్కోసారి డబ్ అయి బాగా ఆడిన సినిమాను కూడా రీమేక్ చేస్తుంటారు. అందుకు ఉదాహరణ పవన్ నటించిన ‘కాటమరాయుడు’. తమిళ సూపర్‌స్టార్ అజిత్ ‘వీరమ్’ సినిమా తెలుగులోకి ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయి స్ట్రీమింగ్ సైట్‌లలో కూడా విడుదలైంది. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దానిని ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దీనిపై వ్యామోహాన్ని పెంచుకున్నట్లు అర్ధం అవుతోంది. ఇతడి తాజా సినిమా ‘వీరమ్’ రీమేక్ అని స్పష్టంగా వినిపిస్తోంది. సల్మాన్ తాజా చిత్రం ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ ఆ సినిమా ఆధారంగా రూపొందుతోందట. ఇందులో వెంకటేష్ అతిధి పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. దీనిని సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. గతంలో సల్మాన్ ‘పోకిరి, రెడీ, బాడీగార్డ్’ వంటి కొన్ని సూపర్ హిట్ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనక బడ్డాడు. దీంతో మరోసారి రీమేక్ నే నమ్ముకున్నాడు. మరి ‘కాటమరాయుడు’గా పవన్ వల్ల కాని సక్సెస్ ను సల్మాన్ రీమేక్ తో అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version