Is Arohi Rao Disturbing RJ Surya In Bigg Boss House: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెంట్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటి ఒకటి రెండు వారాల్లో భార్యాభర్తలైన రోహిత్, మరినా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగార్జున కూడా వాళ్ళ రొమాన్స్ ను కొంత మేరకు ప్రోత్సహించినా.. ఇప్పుడు ఆ హంగామా కాస్తంత సద్దుమణిగింది. బట్… బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందే మంచి ఫ్రెండ్స్ అయిన ఆర్జే సూర్య, ఆరోహి మధ్య సాగుతున్న బంధానికి ఎవరూ ప్రత్యేకించి ఏ పేరూ పెట్టలేకపోతున్నారు.
‘స్నేహానికి మించి సమ్ థింగ్ సమ్ థింగ్ వాళ్ళ మధ్య సాగుతోంద’ని మాత్రం చెప్పగలుగుతున్నారు. అయితే… ఈ ఇద్దరూ కూడా కంటెంట్ కోసం ఇలా ప్రవర్తిస్తున్నారనే సందేహాన్ని కూడా కొందరు హౌస్ మేట్స్ బాహాటంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జే సూర్య కాస్తంత డిస్ట్రబ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. తన మూడ్ బాగున్నప్పుడల్లా ఆరోహి… సూర్య దగ్గర కెళ్ళి అతన్ని గోకడం… బుంగమూతి పెట్టి ఏదో ఒకటి తినిపించమని వయ్యారాలు పోవడం… దాంతో ఈ కుర్రాడి బుర్ర హీటెక్కిపోవడం జరుగుతోంది. ఒక్కో టైమ్ లో ఆరోహిని ఎలా వదిలించుకోవాలో తెలియక సూర్య తికమక పడుతున్నాడు.
మంగళవారం ఒకానొక సమయంలో ఆరోహి తనను వదిలి దూరంగా వెళ్ళగానే, ‘ఈ బంధాలు, అనుబంధాలు శాశ్వతం కాదని, బిగ్ బాస్ లో విన్నర్ కావడమే తన లక్ష్యమని, దాని మీదనే ఫోకస్ పెట్టాల’ని సెల్ప్ మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆరోహి చాలా తెలివిగా ఆర్జే సూర్యను కంటెంట్ కోసం ట్రాప్ చేస్తున్నట్టు అర్థమైపోతోంది. అదే సమయంలో ఆమె గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు తన మన అనే తేడా లేకుండా ఆడేస్తోంది. ఈ విషయాన్ని సూర్య ఎప్పటికి అర్థం చేసుకుంటాడో చూడాలి!