NTV Telugu Site icon

Ajith : అజిత్ ఈ సారి కాపీ కొడుతున్నాడా..?

Thala

Thala

అజిత్ కుమార్.. ముద్దుగా ఫ్యాన్స్ ‘తలా’ ‘AK’ అని పిలిచుకొంటారు. అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచాలతో థియేటర్ల వద్ద ఒకటే హంగామా ఉంటుంది. అజిత్ సినిమాల నుండి పోస్టర్, సాంగ్ వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్. మరోవైపు తమిళ్ లో అజిత్ ,విజయ్ మధ్య ఫ్యాన్ వార్స్ తార స్థాయిలో ఉంటాయి. అజిత్ ఫ్యాన్స్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంటుంది వ్యవహారం. ఇది కాస్త ఇరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది.

కాగా అజిత్ ‘విడాముయార్చి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రానికి సంబంధిచిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్. అది ఫాన్స్ ను ఒకింత నిరుత్సహానికి గురిచేసింది. సోషల్ మీడియాలో అజిత్ ఫాన్స్ నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను తెలియజేసారు.దిద్దుబాటు చర్యలు చేపట్టిన లైకా ప్రొడక్షన్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు మరో రెండు పోస్టర్ లు వదిలింది. కానీ ఆ రెండు పోస్టర్ లు హాలీవుడ్ చిత్రం బ్రేక్ డౌన్ చిత్రాన్ని పోలివుండడం, అజిత్ చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం బ్రేక్ డౌన్ నుండి రీమేక్ చేస్తున్నారేమోనన్న సందేహాలకు తావిస్తోంది.

 

గతంలో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసాడు అజిత్, ఇప్పుడు విడాముయార్చి కూడా రీమేక్ చేస్తున్నారని అని తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి లైక ప్రొడక్షన్స్ ఈ వార్తలపై స్పందిస్తుందో లేదో చూడాలి. మరోవైపు ఈ చిత్రంలో అజిత్ కార్ ఛేజింగ్, ఫైట్స్ డూప్ లేకుండా చేస్తున్న వీడియోలను చిత్ర యూనిట్ విడుదల చేయగా ఈ వయసులో అజిత్ డెడికేషన్ ను ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. సంక్రాంతి కనుకగా జనవరిన విడుదలకి సిద్ధం అవుతోంది విడాముయార్చి.

Show comments