Suriya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త మార్పులు వస్తునాన్యి. అంతకు ముందులా అభిమానులు, ప్రేక్షకులు హీరోల కోసం కొట్టుకోవడం లేదు. సినిమా బావుంటే ఆదరిస్తున్నారు.. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా మొహమాటం లేకుండా ముఖం మీదే బాగోలేదని చెప్తున్నారు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా హీరోలను అభిమానిస్తున్నారు. అలంటి అభిమానాన్ని చూరగొన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గజినీ సినిమాతో తెలుగువారికి సుపరిచితుడుగా మారిన ఈ హీరో ఈ సినిమా తరువాత వరుస చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేసి తెలుగు హీరోగానే మారిపోయాడు. సూర్య నటించిన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ కావడం విశేషం. ఇక ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. మరి ముఖ్యంగా విక్రమ్ లో రోలెక్స్ పాత్రలో సూర్య నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇక ఆ అభిమానాన్ని నేడు బయటపెట్టారు తెలుగు యువత.. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులు అబిమానాయించడం మొదలుపెడితే ఎలా ఉంటుందో సూర్యకు జస్ట్ శాంపిల్ చూపించారు తెలుగు కుర్రాళ్ళు. నేడు సూర్య బర్త్ డే సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని యువత భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. 500 ల బైక్ లతో సూర్య ఫోటోలను పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఒక నాన్ టాలీవుడ్ హీరోకు ఇంతలా బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం ఇదే మొదటిసారి. ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ కు ఇలా చేసేవారు.. ఇప్పుడు ఆ గౌరవం సూర్యకు దక్కింది. ఇక ఈ విషయం తెలియడంతో సూర్య తమిళ్ అభిమానులు సైతం అది రోలెక్స్ సర్ పవర్ అంటే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
