Site icon NTV Telugu

Ramabanam: ఐఫోన్ సాంగ్ తో అదరగొట్టారు…

Ramabanam

Ramabanam

మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. గోపీచంద్ తో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్యం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి శ్రీరామనవమికి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పాజిటివ్ ఫీబ్ బ్యాక్ తెచ్చుకోగా లేటెస్ట్ గా మేకర్స్ రామబాణం సినిమా నుంచి ‘ఐఫోన్’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లీడ్ యాక్టర్స్ పై కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి మిక్కీ జే మేయర్ క్యాచీ ట్యూన్ ఇచ్చాడు.

Read Also: Ram Gopal Varma: మళ్ళీ వర్మకు పూర్వ వైభవం వచ్చేనా!?

గత కొంతకాలంగా సూపర్బ్ సాంగ్స్ రాస్తున్న కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. మంచి ట్యూన్, అందరూ హమ్ చెయ్యగల లిరిక్స్ సెట్ అవ్వడంతో సగం సక్సస్ అయిన పాటకి రామ్ మిర్యాల, మోహన భోగరాజు తన వోకల్స్ తో ఇంకా ఆకట్టుకునేలా చేశారు. విజువల్స్ అండ్ హుక్ స్టెప్ కూడా ఐఫోన్ సాంగ్ ని అందరూ ఎంజాయ్ చేసేలా చేశాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇదే వైబ్ ని మేకర్స్ మే 5 వరకూ క్యారీ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటే చాలు రామబాణం హిట్ అయినట్లే.

Exit mobile version