బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, మరియు నాగార్జున అక్కినేని వంటి తారాగణంతో ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 2021లో శివ పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నేడు అలియా భట్ పుట్టినరోజుని పురస్కరించుకుని “బ్రహ్మాస్త్ర” టీం ఆమె అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా అలియా పాత్రను పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేసింది.
Read Also : Ashoka Vanam Lo Arjuna Kalyanam : రిలీజ్ డేట్ ఫిక్స్
దర్శకుడు అయాన్ ముఖర్జీ, బ్రహ్మాస్త్ర బృందం అలియాను ఇషాగా పరిచయం చేశారు. ఈ వీడియోలో ఆమెకు సంబంధించిన కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కలగలిపిన సీన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మాగ్నమ్ ఓపస్ 2022 సెప్టెంబర్ 09న థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల కానుంది.
