NTV Telugu Site icon

Virupaksha: కొత్త ప్రపంచంలోని మొదటి అధ్యాయం- మోధమాంబ టెంపుల్

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SVCC ప్రొడ్యూస్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా భారి బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరూపాక్ష ప్రమోషన్స్ కోసం ఇప్పటివరకూ స్టార్ హీరోస్ ని వాడుతూనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని, టీజర్ లాంచ్ కోసం పవన్ కళ్యాణ్ ని వాడిన సుప్రీమ్ హీరో, ఈసారి మాత్రమే తనే రంగంలోకి దిగాడు. విరూపాక్ష ప్రపంచాన్ని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ‘into the world of virupaksha’ అనే ట్యాగ్ తో ప్రమోషనల్ వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విరూపాక్ష సినిమా కోసం వేసిన ‘మోధమాంబ టెంపుల్’ సెట్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

రుద్రవనం అనే ఊరిని సెట్ వేసిన చిత్ర యూనిట్, విరూపాక్ష సినిమాలో అత్యంత ముఖ్య పాత్ర పోషించే ‘మోధమాంబ టెంపుల్’ సెట్ ని వేశారు. విలేజ్ వాతావరణంలో మిస్టరీ అప్పీరెన్స్ ఇస్తూ వేసిన ఈ సెట్ సినిమాకి థ్రిల్లర్ కలర్ తెచ్చింది. గ్లిమ్ప్స్ లో, టీజర్ లో లైట్ గా రివీల్ చేసిన ఈ టెంపుల్ సినిమాలో ఎలా ఉంటుంది? ఈ టెంపుల్ స్పెషాలిటి ఏంటి అనేది చూడాలి. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్, SVCC కాంబినేషన్ లో బయటకి రానున్న ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Show comments