Site icon NTV Telugu

Intinti Ramayanam Trailer: పెళ్ళాం ఊరెళ్లిందని మందేస్తే.. మొత్తం ఊడ్చేశారుగా

Aha

Aha

Intinti Ramayanam Trailer: ప్రేక్షకులకు వినోదాన్ని పంచివ్వడంలో ఆహా ఎప్పుడు ఆహానే. ప్రతి శుక్రవారం కొత్త సినిమానో, వెబ్ సిరీస్ నో అందిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆహా ఒరిజినల్స్ నుంచి వస్తున్న మరో సినిమా ఇంటింటి రామాయణం. కమెడియన్ రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి జంటగా సురేష్ నారెడ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

LGM Teaser: ధోని ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమా.. టీజర్ అదిరిపోయింది

ఒక ఊరిలో నరేష్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అతని కూతురు నవ్య.. ఆ ఊరిలోనే ఉంటున్న రాహుల్ ప్రేమించుకుంటారు. నరేష్ ను రాహుల్ మామ మామ అని పిలుస్తుండడంతో కూతురును కాలేజ్ లో దింపి వచ్చే పని రాహుల్ కు అప్పజెపుతాడు. ఇక వీరు ఇంట్లో తెలియకుండా ప్రేమాయణం నడుపుతుంటారు. ఇంకోపక్క నరేష్ కు ప్రాణాలు ఇచ్చే బావమరిది, తమ్ముడు ఉంటారు. వారిలానే రాహుల్ ను కూడా చూసుకుంటాడు నరేష్. ఇక ఈ క్రమంలోనే నరేష్ పెళ్ళాం, కూతురుతో కలిసి 15 రోజులు ఊరు వెళ్తోంది. ఇక పెళ్ళాం ఊరెళ్ళిందని, నరేష్ తమ్ముడు, బావమరిది, రాహుల్, ఫ్రెండ్స్ అందరు మందు పార్టీ చేసుకుంటారు. ఫుల్ గా మందుకొట్టి ఉదయానే లేచి చూసేసరికి ఇంట్లో బంగారం కనిపించదు. ఆ పార్టీకి వచ్చినవారే తీసారని నరేష్ అనుమానిస్తాడు. ఆ అనుమానం.. బంధాల మధ్య అగాధాన్ని రేకెత్తిస్తాయి. ప్రాణంగా చూసుకున్న బావమరిది, తమ్ముడు కూడా నరేష్ కు ఎదురుతిరుగుతారు.. అసలు ఆ బంగారాన్ని కొట్టేసింది ఎవరు..? రాహుల్ కు ఆ బంగారానికి సంబంధం ఏంటి.. మనోళ్లు, బయటోళ్లు గోల ఏంటి.. ? చివరికి ఈ జంట ఒక్కటో అయ్యారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రాహుల్ హీరోగా చాలా సినిమాలే వచ్చాయి. అయన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వినోదాత్మకంగా సాగే పల్లెటూరి కథ అయినా.. ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే కాబట్టి అందరు ఎడిక్ట్ అవుతారు అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version