మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు అనట్లు.. సినిమాకు సైన్ చేసిన పాపానికి కథ డిమాండ్ చేసిన మేరకు, హీరో హీరోయిన్లు, ఇతర నటుల మధ్య బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ వంటి సన్నివేశాలు తీస్తుంటారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. చూసేవాళ్ళే కొన్నిసార్లు ఇబ్బంది పడతారు .. అలాంటిది యాక్ట్ చేసేవాళ్లు ఇంకేలా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఇబ్బండి పడినా, ఎవరు ఏమనుకున్నా సినిమా ఒప్పుకున్నాక బోల్డ్ సీన్స్‌లో నటించాల్సిందే. అలా మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హిట్ చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ‘మంగళవారం’ కూడా ఒకటి.
Also Read:Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఎంతో త్రిలింగ్‌గా ఆకట్టుకుంది, ముఖ్యంగా పాయల్ క్యారెక్టర్ కి వంద మార్కులు పడ్డాయి. ఇలాంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందుకే ‘మంగళవారం’ మూవీ హిట్ తో పాయల్ కు స్పెషల్ క్రేజీ ఏర్పడింది. అంతేకాదు కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ స్థానంలో కొత్త నటి కనిపిస్తుంది అని. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానుందట. మరి ఈసారి పాయల్ పాత్రలో కనిపించేది ఎవరు ఏంటి అనే అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.