యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకుని, మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “RAPO19” అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర టైటిల్ జోరుగా ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం “RAPO19″కి “వారియర్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇదే విషయాన్ని ఈరోజు ఇవ్వనున్న ప్రకటనలో మేకర్స్ ధృవీకరించనున్నారు. ఇదే గనుక నిజమైతే టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.
Read Also : ‘బంగార్రాజు’ డైరెక్టర్ కు బిగ్ ఆఫర్
“RAPO19” అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తారాగణం మరియు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే కొన్ని వారాల్లో వెలువడనున్నాయి. ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
