NTV Telugu Site icon

Waltair Veerayya: మూల విరాట్ ఆంధ్రాలో… మాస్ మహారాజ్ తెలంగాణాలో…

Waltair Veerayya

Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ ‘వాల్తేరు వీరయ్య’పై ఉన్న హైప్ ని అమాంతం పెంచింది రవితేజ టీజర్. ఈ టీజర్ ని మెయిన్ హైలైట్ రవితేజ స్లాంగ్. తెలంగాణా యాసలో రవితేజ డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ని మాస్ మహారాజ ఫాన్స్ రిపీట్ మోడ్ లో చూశారు.

రవితేజ, చిరులని కలిపిన డైరెక్టర్ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఆంధ్రా తెలంగాణా రెండు ప్రాంతాలని కవర్ చేసేలా ఉంది. రవితేజ తెలంగాణా యాసలో మాట్లాడుతుంటే, చిరు ఆంధ్రా యాసలో ఇరగాదీస్తున్నాడు. చిరు గ్లిమ్ప్స్ లో, బాస్ పార్టీ సాంగ్ లో ఆంధ్రా స్లాంగ్ లో మాట్లాడుతూ కనిపించాడు. ఇద్దరు హీరోలు రెండు యాసల్లో మాట్లాడడం ఏంటి? చిరు, రవితేజల మధ్య ఉన్న లింక్ ఏంటి? సినిమా తెలంగాణా, ఆంధ్రాలో జరుగుతుందా? చిరు ఆంధ్రా నుంచి తెలంగాణాకి వస్తాడా? లేక తెలంగాణా నుంచి రవితేజనే ఆంధ్రాకి వస్తాడా? ఇలా చాలా ప్రశ్నకి సమాధానం తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే జనవరి 13 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆరోజు వాల్తేరు వీరయ్య, విక్రం సాగర్ తో పాటు వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడేమో చూడాలి.

Show comments