పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో ఒక భాగమయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.
పవన్- బ్రహ్మి కాంబో స్క్రీన్ పై ఎంతటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . అప్పుడెప్పుడో బద్రి నుంచి మొన్నటి సర్దార్ గబ్బర్ సింగ్ వరకు వీరి కాంబోకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక భీమ్లా నాయక్ తో మరోసారి ఈ కాంబో రిపీట్ కానున్నదంటే ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో బ్రహ్మి ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది. మాత్రికా అయ్యప్పన్ కోషియం లో బీజూ మీనన్ ఎటువంటి కామెడీ యాంగిల్ టచ్ చేయలేదు.. మరి ఇందులో త్రివిక్రమ్ ఏదైనా కామెడీ ట్రాక్ రాశారా ..? బ్రహ్మి నవ్విస్తాడా..? లేక ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడా ..? అని ఇప్పటినుంచే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ ఆత్రుత తగ్గాలంటే జనవరి 13 వరకు వేచి చూడాల్సిందే.
