Site icon NTV Telugu

Indian Heroes: మన హీరోల దెబ్బకి ఆక్వామన్ కూడా కనిపించట్లేదు

Indian Heroes

Indian Heroes

మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. డైనోసర్ లాంటి ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమ సినిమాలు సలార్ అండ్ డంకీలతో వార్ కి రెడీ అయ్యారు. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్త బయటకి రాగానే… ఇంత పెద్ద క్లాష్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లాస్ట్ కి వెనక్కి తగ్గుతారులే అనుకున్నారు. ఎవరెన్ని అనుకున్నా ప్రభాస్, షారుఖ్ ఖాన్ లు వెనక్కి తగ్గకుండా తమ సినిమాలని రిలీజ్ చేయడానికే ప్రిపేర్ అయ్యారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక క్లాష్ ని అవాయిడ్ చేసే అవకాశమే లేదు. డంకీ క్లాస్ సినిమా కాబట్టి A సెంటర్స్, మిడిల్ ఈస్ట్ అండ్ మేజర్ ఓవర్సీస్ సెంటర్స్ లో షారుఖ్ డామినేషన్ ఉంటుంది. సలార్ సినిమా ఓవర్ ది బోర్డ్ యాక్షన్ ఎక్స్ట్రావెంజా కాబట్టి సౌత్ ఇండియా, నార్త్ బీ-సీ సెంటర్స్, సింగల్ స్క్రీన్ థియేటర్స్, ఓవర్సీస్ లోని కొన్ని మేజర్ సెంటర్స్ లో ప్రభాస్ హవా ఉంటుంది.

ఇప్పటివరకు అయిన బుకింగ్స్ కూడా ఇదే ప్రూవ్ చేస్తుంది. ఏరియాలని పంచుకోని ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు ఇండియానే కాకుండా వరల్డ్ బాక్సాఫీస్ ని కూడా టార్గెట్ చేస్తుంటే… హాలీవుడ్ సూపర్ హీరో సినిమా చేసే సౌండ్ కూడా ఎవరికీ వినిపించట్లేదు. డిస్నీ, వార్నర్ బ్రదర్స్ లాంటి బిగ్ నేమ్స్ తో అసోసియేట్ అయిన ఆక్వామెన్ 2 సినిమా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఆక్వామెన్ 1 ఇండియాలో కూడా సూపర్ హిట్ అయ్యింది, సీక్వెల్ మరింత పెద్ద హిట్ అవ్వాల్సింది. అయితే సలార్, డంకీ  సినిమాల దెబ్బకి ఆక్వామెన్ 2 ఎక్కడా కనిపించట్లేదు. సూపర్ హీరో సినిమాకి కూడా బజ్ లేకుండా చేస్తున్నారు అంటే ప్రభాస్ అండ్ షారుఖ్ ల మధ్య వార్ ఎంత ఇంటెన్స్ గా జరగబోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.

Exit mobile version